RC 16 : మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తన 16వ సినిమాతో మరోసారి ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో “గేమ్ ఛేంజర్” అనే భారీ చిత్రంలో నటిస్తున్న చరణ్, ఆ సినిమా షూటింగ్‌ను ముగించుకుని తన తదుపరి ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టబోతున్నాడు. బుచ్చిబాబు సానా దర్శకత్వం లో ఈ సినిమా తెరకెక్కబోతోంది.

తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా కోసం రామ్ చరణ్ సరికొత్త మేకవర్ తో రాబోతున్నాడు. మాస్ లుక్ లో కనిపించబోయే చరణ్ ఈ సినిమా కోసం తన శరీరాన్ని మరింత బిల్డప్ చేసుకోబోతున్నాడు. అంతేకాకుండా లాంగ్ హెయిర్ లుక్లో కూడా కనిపించబోతున్నాడని టాక్. ఈ కొత్త లుక్ కోసం చరణ్ ఇప్పటికే చాలా కష్టపడి పనిచేస్తున్నాడు.

ఈ సినిమా షూటింగ్ ఆగస్ట్ నెలలో ప్రారంభం కానుంది.  జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, ఆస్కార్ గ్రహీత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ మరియు వృద్ధి సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రామ్ చరణ్ కొత్త లుక్ , బుచ్చిబాబు దర్శకత్వ శైలి ఈ సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పాయి. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.

Leave a comment

error: Content is protected !!