OG movie : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ గ్యాంగ్ స్టర్ డ్రామా ఓజీ. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ గ్లింప్స్‌కి అభిమానులు, ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది.

తాజా సమాచారం ప్రకారం.. యస్ యస్ థమన్ ఓజీ కోసం సంగీత పనులను ప్రారంభించాడు. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో ఒక పోస్ట్‌ను పంచుకున్నాడు, “ఓజీ బ్లాస్ట్ వచ్చేస్తోంది. గ్లింప్స్ స్కోర్‌కి థమన్ అద్భుతమైన రెస్పాన్స్అందుకున్నాడు. గతంలో తమన్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ , వకీల్ సాబ్ మూవీస్ కు అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్స్ అందించాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి ఓజీ పైనే ఉంది.

ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తుండగా, ప్రియాంక మోహన్ కథానాయికగా నటిస్తున్నారు. ఇంకా.. శ్రీయా రెడ్డి, ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, హరీష్ ఉత్తమన్ మరియు అభిమన్యు సింగ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాను నిర్మిస్తోంది.

Leave a comment

error: Content is protected !!