Maharaja : విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నితిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించిన ఎమోషనల్ రివెంజ్ డ్రామా మహారాజా. ఇది విజయ్ సేతుపతి 50వ చిత్రం. జూన్ 14న విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. అటు కోలీవుడ్ లోనూ, ఇటు టాలీవుడ్ లోనూ ఈ సినిమా అద్భుతమైన సక్సెస్ సొంతం చేసుకుంది.
సుదీర్ఘ విరామం తర్వాత, విజయ్ సేతుపతి తన అద్భుతమైన నటనతో హృదయాలను కొల్లగొట్టి తమిళ, తెలుగు ఆడియన్స్ ను అలరిస్తున్నాడు. తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. మమతా మోహన్‌దాస్ కూడా తన సపోర్టింగ్ రోల్‌లో చెప్పుకోదగ్గ నటనను ప్రదర్శించింది.
మహారాజాలో, విజయ్ సేతుపతి తన ఇంటిలో జరిగిన చోరీకి ప్రతీకారం తీర్చుకోవాలనే కసితో రగిలిపోయే బార్బర్ గా నటించాడు. దొంగలు అతని విలువైన ‘లక్ష్మి’ని దొంగిలిస్తారు. అసలు ‘లక్ష్మి’ అంటే ఏమిటి అనే సందిగ్ధ వివరణలతో పోలీసులను గందరగోళానికి గురిచేస్తాడు. ‘లక్ష్మి’ సీక్రెటే ఈ సినిమాపై ప్రేక్షకుల ఆసక్తిని పెంచుతుంది.
ప్రీమియర్ నుండి, మహారాజా మంచి సమీక్షలను అందుకుంది మరియు . ప్రారంభ రోజున రూ.4 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది. బుక్‌మైషోలో ఈ చిత్రం అత్యధికంగా 9.5 రేటింగ్‌ను సాధించడం గమనార్హం. ఈ సినిమాలో ఇంకా.. అనురాగ్ కశ్యప్, మమతా మోహన్‌దాస్, నటరాజ్, భారతీరాజా, అభిరామి, సింగంపులి, అరుల్దాస్, మునిష్కాంత్, వినోద్ సాగర్, బాయ్స్ మణికందన్, కల్కి మరియు సంచనా నామిదాస్ వంటి స్టార్ నటీనటులు ఉన్నారు. ప్యాషన్ స్టూడియోస్, ది రూట్ బ్యానర్‌లపై సుధన్ సుందరం, జగదీష్ పళనిసామి ఈ చిత్రాన్ని నిర్మించారు. బి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం, నేపథ్య సంగీతం సమకూర్చారు.