Saripoda Sanivaram : ‘హాయ్ నాన్న’ తర్వాత నేచురల్ స్టార్ నానీ నటిస్తున్న యాక్షన్ మూవీ సరిపోదా శనివారం. ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించగా, డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మించారు. ఈ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్ కథానాయిక. ఎస్‌.జె.సూర్య, సాయికుమార్‌ కీలక పాత్రల్లో నటించారు.

ఆగస్టు 29న థియేటర్లలోకి రానున్న సరిపోదా శనివారం సినిమా టీజర్, ఫస్ట్ సింగిల్ ఇప్పటికే విడుదలై మంచి స్పందన పొందాయి. లేటెస్ట్ గా ఈ సినిమా నుంచి ఒక సింగిల్ రిలీజైంది. “గరం గరం యముడయో.. సహనాల శివుడయో..” అంటూ సాగే ఈ పాటలో నాని పాత్రలోని విభిన్న కోణాలను చూపించారు.

“మామూలుగా నాటు అయినా నీటు.. ఎరగడు తడబాటు. మాసు..క్లాసుల మధ్యన ఊగుట వీడికి అలవాటు” అని తన వ్యక్తిత్వాన్ని పరిచయం చేసుకుంటాడు నానీ . దీన్ని బట్టి.. సినిమాలో నాని పాత్ర ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. జేక్స్‌ బిజోయ్‌ సంగీతం, సనాపతి భరద్వాజ సాహిత్యం, విశాల్‌ దద్లాని పాత్ర ఈ పాటకు ప్రాణం పోశాయి.

Leave a comment

error: Content is protected !!