Toxic movie : ‘కేజీఎఫ్’ సినిమాలతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన యశ్ నటిస్తున్న మరో భారీ చిత్రం ‘టాక్సిక్’. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. నయనతార, హ్యూమా ఖురేషి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. తాజాగా నయనతార సెట్లోకి అడుగు పెట్టినట్లు సమాచారం. ప్రస్తుతం యశ్, నయనతారలపై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది.

రెండో షెడ్యూల్‌ను యూకేలో చిత్రీకరించనున్నారు. చిత్రంలో ఎక్కువ భాగం అక్కడే షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది. దీనికోసం దాదాపు 150 రోజుల పాటు ఓ సుదీర్ఘ షెడ్యూల్ ప్లాన్ చేశారట. విజయవంతమైన ఆంగ్ల సిరీస్ ‘పీకీ బ్లైండర్స్’ స్ఫూర్తితో ఈ కథను గీతూ సిద్ధం చేశారని ప్రచారం జరుగుతోంది. యశ్ శక్తివంతమైన గ్యాంగ్‌స్టర్ పాత్రలో నటించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం అర్జున్ రెడ్డి అందిస్తున్నారు. ‘టాక్సిక్’ వచ్చే ఏడాది ఏప్రిల్ 10న విడుదల కానుంది.

Leave a comment

error: Content is protected !!