Swag pre teaser : టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు స్క్రిప్ట్ సెలక్షన్‌లో తన రూటే సెపరేట్ అనిపించుకుంటున్నాడు. ఈ విలక్షణ హీరో ‘రాజా రాజా చోరా’ దర్శకుడు హసిత్ గోలీతో మరోసారి జతకట్టాడు. వీరి కాంబినేషన్ లోని తొలి చిత్రంతో మంచి వినోదాన్ని పంచిన ఈ ఇద్దరూ ఇప్పుడు పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టిజి విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ‘స్వాగ్’ మూవీతో మరింతగా అలరించడానికి రెడీ అవుతున్నారు.

‘స్వాగనిక వంశానికి స్వాగతం’ అని ట్యాగ్‌లైన్‌ పెట్టారు. సినిమాలోని అన్ని ప్రధాన పాత్రలను పరిచయం చేసిన తర్వాత చిత్ర యూనిట్ రేజర్ అనే క్లిప్‌ను విడుదల చేసింది. శ్రీవిష్ణు మగవారి గురించి పవర్ ఫుల్ డైలాగ్ వదలడంతో వీడియో ప్రారంభమవుతుంది. శ్రీవిష్ణు భవభూతి అనే వెరైటీ రోల్ ను పోషించాడు. అతని ప్రత్యేకమైన లుక్ , మ్యానరిజమ్స్ కు జనం ఫిదా అవుతున్నారు. స్వాగ్ ప్రీ టీజర్ చాలా ఎంటర్ టైనింగ్ గా ఉంది. హసిత్ గోలీ రచన, దర్శకత్వం రెండూ విశేషమైనవిగా కనిపిస్తున్నాయి.

ఇంక వింజామర వంశంలో క్వీన్ రుక్మిణి దేవి అనే కథానాయికగా రీతూ వర్మ నటిస్తోంది. ఈ సినిమా ద్వారా మీరా జాస్మిన్‌ రీ ఎంట్రీ ఇస్తోంది. మిగిలిన నటీనటుల్లో దక్షనాగార్కర్, శరణ్య ప్రదీప్, సునీల్, రవిబాబు, గెటప్ శ్రీను, గోప రాజు రమణ తదితరులు నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయనున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నాడు. టీజర్‌తో పాటు విడుదల తేదీ కూడా వచ్చే అవకాశం ఉంది.

Leave a comment

error: Content is protected !!