Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప 2: ది రూల్ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ భారీ బడ్జెట్ చిత్రంపై ప్రేక్షకులు, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదటి భాగం పుష్ప: ది రైజ్ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించడంతో, ఈ సినిమాపై అందరి దృష్టి పడింది.

ఏ మాత్రం కాంప్రమైజ్ లేకుండా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం నుండి ఇప్పటివరకు విడుదలైన టీజర్లు, పోస్టర్లు, పాటలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. ఫస్ట్ సింగిల్ “పుష్ప పుష్ప” ఇప్పటికే 100 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించగా, రెండో సింగిల్ “సూసేకి” కూడా యూట్యూబ్ లో వైరల్ అవుతోంది. ఈ పాటకు 100 మిలియన్లకు పైగా వ్యూస్, 1.67 మిలియన్ల లైక్స్ వచ్చాయి.

ఆగస్టు 15 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఫహాద్ ఫాసిల్, అనసూయ భరద్వాజ్, ధనంజయ, సునీల్, రావు రమేష్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Leave a comment

error: Content is protected !!