Needaare Neekatha : సంగీత నేపథ్యంతో రూపొందిన చిత్రం నీ దారే నీ కథ. ఈ మూవీ ఆకట్టుకునే సినిమాటిక్ అనుభవాన్ని అందిస్తుంది. వంశీ జొన్నలగడ్డ స్వీయదర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా యువతను టార్గెట్ గా చేసుకుంది. ఈ చిత్రం లోని కథాంశం అందరినీ మెప్పిస్తుంది. సీనియర్ యాక్టర్ సురేష్ , ప్రియతమ్ మంతిని, విజయ విక్రాంత్, అనంత పద్మశాల, అంజన బాలాజీ, వేద్.. తదితరులు నటించారు.

సంగీతం మనసును కదిలిస్తుంది. అభిరుచి, స్నేహం, కలల సాధన, తండ్రీ కొడుకుల అనుబంధం వంటి అంశాలు కథాంశంగా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను భావోద్వేగాల ఊయలలూ పుతుంది. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడం గురించి ఈ చిత్రం ఒక సందేశాన్ని ఇస్తుంది.

లేటెస్ట్ గా ఈ సినిమా ప్రీమియర్ షో చూసిన ప్రముఖులు, కళాకారులు చిత్రాన్ని ఎంతగానో ప్రశంసించారు. తండ్రీ కొడుకుల మధ్య అనుబంధాన్ని చాలా బాగా చిత్రీకరించారని మెచ్చుకున్నారు. కొత్త నటులు అయినప్పటికీ, ప్రతి ఒక్కరూ తమ పాత్రలకు న్యాయం చేశారని అభినందించారు. సినిమాకు సంగీతం ఒక ముఖ్య ఆకర్షణ అని చెప్పారు.

Leave a comment

error: Content is protected !!