Vijay Sethupathi :  కోలీవుడ్ మక్కళ్ సెల్వన్ విజయ్ సేతుపతి తన 50వ సినిమా “మహారాజా”తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా జూన్ 14న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. “మహారాజ” సినిమా గురించి మీడియాతో మాట్లాడుతూ… విజయ్ సేతుపతి ఇది ఒక ప్రత్యేకమైన సినిమా అని, తన కెరీర్ లో ఒక మైలురాయి అని అన్నారు. ఈ కథ తనకు చాలా నచ్చిందని, దర్శకుడు నితిలన్ స్వామినాథన్ దీన్ని చాలా బాగా తెరకెక్కించారని, విడుదలైన తన సినిమాలు 50 మాత్రమే కావొచ్చు. కానీ తాను 500 కంటే ఎక్కువ కథలు విన్నానని, ఎంతో మందిని కలిశానని . విజయాలు, పరాజయాలూ చూశానని, ఇదొక గొప్ప అనుభవమని చెప్పారు.

ఈ సినిమాలో, విజయ్ సేతుపతి ఒక సాధారణ వ్యక్తి పాత్రలో నటిస్తున్నాడు. తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి అతను ఎంత దూరం వెళ్తాడో చూపిస్తుంది. ఈ సినిమాలో అనురాగ్ కశ్యప్, నటరాజ్, భారతీరాజా, అభిరామి, మాముత మోహన్ దాస్, సింగంపులి, అరుల్దొస్, మునిష్కాంత్, వినోద్ సాగర్, బాయ్స్ మణికంఠన్, కల్కి, సచినా నామిదాస్ తదితర నటులు నటించారు.

Leave a comment

error: Content is protected !!