Raayan movie : జాతీయ అవార్డు గ్రహీత, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘కుబేర’ అనే సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఇక తన 50వ చిత్రం రాయన్ చిత్రంలో తదుపరిగా కనిపించ నున్నాడు. ఈ సినిమాకి ధనుషే స్వయంగా దర్శకుడు. ఈ సినిమా మొదట జూన్ 13న విడుదల కావాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది.

కొద్ది నిమిషాల క్రితం, మేకర్స్ కొత్త విడుదల తేదీని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. రాయన్ జులై 26, 2024న థియేటర్స్ లోకి రావడానికి సిద్ధంగా ఉంది. ఇది ధనుష్ రెండవ డైరెక్టోరియల్ వెంచర్. ‘పవర్ పాండి’ తర్వాత ధనుష్ దర్శకత్వం వహించే చిత్రం ఇదే అవుతుంది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.

SJ సూర్య, సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్, సెల్వరాఘవన్, ప్రకాష్ రాజ్, దుషార విజయన్, అపర్ణా బాలమురళి , వరలక్ష్మి శరత్‌కుమార్‌ తదితరులు నటిస్తు్న్న రాయన్‌ మూవీని సన్ పిక్చర్స్ నిర్మించింది. AR రెహమాన్ సంగీతం సమకూర్చారు.

Leave a comment

error: Content is protected !!