BB 4 : నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటేనే అభిమానులకు గూస్ బంప్స్ వస్తాయి. బాలయ్య లాంటి మాస్ స్టార్ ని ఎలా హ్యాండిల్ చేయాలో ఆయనకి మాత్రమే తెలుసు. బాలకృష్ణ కెరీర్‌లో గత 15 ఏళ్లలో బిగ్గెస్ట్ హిట్స్ బోయపాటి దర్శకత్వంలోనే వచ్చాయి. 2010లో వచ్చిన ‘సింహా’ సంచలనం కాగా, ఆ తర్వాత 2014లో వచ్చిన ‘లెజెండ్’ కూడా సూపర్ హిట్ అయింది.

2021లో వచ్చిన ‘అఖండ’ ఇప్పటి వరకు బాలయ్య కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్. ఈ చిత్రం తెలుగు బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించింది. బోయపాటి టేకింగ్‌కు తోడు అఘోరా పాత్రను బాలయ్య శక్తివంతంగా పోషించడం వల్ల అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ నేపథ్యంలో 4వ సారి వీరి కలయిక గురించి చాలా కాలంగా చర్చలు జరుగుతున్నాయి. అయితే ఎట్టకేలకు బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ప్రకటించారు. గ్రాండ్ పోస్టర్ స్పష్టం చేసింది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ ఈ ప్రాజెక్ట్‌ను అత్యంత భారీగా తెరకెక్కించబోతోంది.

Leave a comment

error: Content is protected !!