ప్రముఖ దర్శకుడు కె.విజ‌య్‌భాస్కర్ తన తదుపరి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. “ఉషా పరిణయం” అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఒక ఫీల్-గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. “లవ్ ఈజ్ బ్యూటిఫుల్” అనే ఉపశీర్షికతో ఈ చిత్రం రూపొందుతోంది.
విజ‌య్‌భాస్క‌ర్ స్వంత నిర్మాణ సంస్థ క్రాఫ్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యానర్‌పై ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇటీవలే ఈ చిత్రం నుండి టీజర్ విడుదలై మంచి స్పందనను అందుకుంది. ఈ చిత్రంలో విజ‌య్‌భాస్క‌ర్ కుమారుడు శ్రీ‌క‌మ‌ల్ హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రం ద్వారా తాన్వీ ఆకాంక్ష అనే కొత్త నటి తెలుగు సినీరంగంలోకి అడుగుపెడుతోంది. వెన్నెల కిషోర్‌, శివాజీ రాజా, ఆమని, సుధ, ఆనంద్‌ చక్రపాణి, రజిత, బాలకృష్ణ తదితరులు నటిస్తున్నారు.

ఈ చిత్రానికి ఆర్‌.ఆర్‌. ధ్రువ‌న్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రం నుండి “ఆకాశానికే జాబిలి అందం.. భూగోళానికే నా చెలి అందం” అనే పాట విడుదలై మంచి ఆదరణ పొందింది. ఈ పాటకు అల‌రాజు సాహిత్యం అందించారు. ధ్రువ‌న్ ఈ పాటను ఆలపించారు. ఈ చిత్రం ఒక ప్రేమకథ చుట్టూ తిరుగుతుంది. ప్రేమకు దర్శకుడు భాస్కర్ ఇచ్చే కొత్త నిర్వచనం ఈ చిత్రం అని చెబుతున్నారు. ఈ చిత్రంలో అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా అన్ని రకాల భావోద్వేగాలు ఉంటాయని దర్శకుడు తెలిపారు.

Leave a comment

error: Content is protected !!