Shivakarthikeyan – Murugados combo : తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ , ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్ లో శ్రీ లక్ష్మీ మూవీస్ నిర్మిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తెలుగు, తమిళ్ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో టాలెంటెడ్ యాక్టర్ విద్యుత్ జమ్వాల్ పవర్ ఫుల్ విలన్ పాత్రలో నటిస్తున్నట్లు మేకర్లు తాజాగా ప్రకటించారు. ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్ షెడ్యూల్‌లో విద్యుత్ జమ్వాల్‌ సెట్‌లో జాయిన్ అయ్యారు.

ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్లు విడుదల చేసిన మేకింగ్ వీడియోలో విద్యుత్ జమ్వాల్ గన్ షూట్ చేస్తూ కనిపించడం చాలా ఆసక్తికరంగా ఉంది. దర్శకుడు ఏఆర్ మురుగదాస్ తన ప్రసిద్ధ కథ చెప్పే శైలి, అద్భుతమైన సెట్టింగ్‌లతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రం హై యాక్షన్‌తో కూడిన అద్భుతమైన అనుభవాన్ని అందిస్తుంది. వరుసగా బ్లాక్‌బస్టర్ హిట్‌లను అందిస్తున్న హీరో శివకార్తికేయన్ కెరీర్‌లో ఇది అతిపెద్ద, భారీ చిత్రం. ఈ చిత్రంలో శివకార్తికేయన్ యూనిక్, స్టైలిష్ లుక్‌లో కనిపించనున్నారు. టాలెంటెడ్ కన్నడ నటి రుక్మిణి వసంత్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. శ్రీ లక్ష్మీ మూవీస్ సంస్థ పాన్ ఇండియా స్థాయిలో భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

Leave a comment

error: Content is protected !!