Upendra A movie : 1998లో విడుదలైన ‘ఎ’ సినిమా తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయి. ఉపేంద్ర నటన, దర్శకత్వం ఈ చిత్రానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఘన విజయం సాధించిన ఈ చిత్రం 26 ఏళ్ల తర్వాత మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. చందు ఎంటర్‌టైన్‌మెంట్, ఉప్పి క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని రీ-రిలీజ్ చేస్తున్నాయి.

నిర్మాత లింగం యాదవ్ మాట్లాడుతూ, “26 ఏళ్ల క్రితం విడుదలైన ఈ చిత్రం అప్పట్లోనే రూ. 20 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. కన్నడ చిత్ర పరిశ్రమలో ఒక ప్రత్యేకమైన ట్రెండ్‌ను సెట్ చేసిన ఈ చిత్రం, ఇటీవలే మరోసారి కన్నడలో విడుదలై మంచి స్పందనను పొందింది. తెలుగు ప్రేక్షకులనూ అదే స్థాయిలో అలరిస్తుందని ఆశిస్తున్నాం” అని అన్నారు. ఈ నెల 21న ‘ఎ’ సినిమా తెలుగులో రీ-రిలీజ్ కానుంది. ఉపేంద్ర అభిమానులు ఈ సినిమాను మళ్లీ తెరపై చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Leave a comment

error: Content is protected !!