8 Vasanthalu : విజయవంతమైన పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ చిత్రాలతో పాటు కంటెంట్ రిచ్ సినిమాలను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇంతకు ముందు వారు దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టితో కాన్సెప్ట్ బేస్డ్ చిత్రం ‘8 వసంతాలు’ అనౌన్స్ చేశారు.

గోవా, కాట్మండు ఫెస్టివల్స్‌లో రెండుసార్లు అంతర్జాతీయ అవార్డులు గెలుచుకున్న ఫణీంద్ర నర్సెట్టి విమర్శకుల ప్రశంసలు అందుకున్న ‘మను’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ‘మ్యాడ్’ ఫేమ్ అనంతికా సనీల్ కుమార్ ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఆమె పాత్ర పేరు శుద్ధి ఆయోధ్య.

19 ఏళ్ల ప్రశాంతమైన యువతి నుండి 8 సంవత్సరాల వ్యవధిలో 27 ఏళ్ల తీవ్రమైన యువతిగా మారే శుద్ధి ఆయోధ్య పరివర్తన ప్రయాణం అనేక మంది వ్యక్తులు, భావోద్వేగాలను అన్వేషించడమే ‘8 వసంతాలు’ కథాంశం. టైటిల్ పోస్టర్ ఆసక్తిని రేకెత్తిస్తే, అనంతిక ఫస్ట్ లుక్ పోస్టర్ మనల్ని ‘8 వసంతాలు’ ప్రపంచంలోకి ఒక్కసారిగా తీసుకువెళుతుంది.

Leave a comment

error: Content is protected !!