Kalki 2898 AD :  పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన భారీ చిత్రం ‘కల్కి 2898 ఎ.డి’. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2898లో భవిష్యత్తు నేపథ్యంలో సాగుతుంది. భైరవ అనే పాత్రలో ప్రభాస్ నటిస్తుండగా, దీపికా పదుకొణె, దిశా పటానీ కథానాయికలుగా నటించారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రల్లో నటించారు. వైజయంతీ మూవీస్ పతాకంపై సి. అశ్వనీదత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ట్రైలర్ జూన్ 10న విడుదల కానుంది. “ప్రతిదీ మార్పు గురించే…” అనే ట్యాగ్‌లైన్‌తో ఇటీవల విడుదలైన పోస్టర్ సినిమాపై భారీ అంచనాలను రేకెత్తించింది.

భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్ యాక్షన్ సన్నివేశాలు, విజువల్స్ నాగ్ అశ్విన్ దర్శకత్వ శైలి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయనున్నాయని సినిమా వర్గాలు ఊహిస్తున్నాయి. ట్రైలర్ విడుదలతో సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది. ఈ చిత్రంలో భైరవ పాత్రలో ప్రభాస్ సరికొత్త లుక్‌లో కనిపించనున్నాడు. బుజ్జి అనే కారు కూడా ఈ కథలో కీలక పాత్ర పోషిస్తుంది. 2898లో ఎలాంటి ప్రపంచం ఉంటుంది? భైరవ-బుజ్జి కథ ఏమిటో తెలుసుకోవాలంటే ఈ నెల 27న విడుదలవుతున్న ‘కల్కి 2898 ఎ.డి’ చూడాల్సిందే.

Leave a comment

error: Content is protected !!