Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 చిత్రం ఆగస్ట్ 15 న వరల్డ్ వైడ్ గా భారతీయ ప్రధాన భాషల్లో విడుదల కాబోతోంది. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తుండగా, రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

తాజాగా  బన్నీ హైదరాబాద్ విమానాశ్రయంలో కనిపించారు. మాస్క్ ధరించిన అల్లు అర్జున్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు కొద్ది సేపటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పుష్ప 2 ది రూల్ షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ కి చేరుకున్నట్లు తెలుస్తోంది. పుష్పరాజ్ పాత్ర ప్రేక్షకులపై ఎలాంటి ఇంపాక్ట్ ను క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. మొదటి భాగం కంటే రెండో భాగం మరింత అద్భుతంగా ఉండేలా మేకర్స్ గట్టిగా ప్లాన్స్ వేస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం నుండి ఇప్పటివరకు విడుదలైన రెండు పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

Leave a comment

error: Content is protected !!