Swag movie : ‘సామజవరగమన’, ‘ఓం భీమ్‌ బుష్‌’ చిత్రాలతో వరుసగా హిట్స్ అందుకుని శ్రీవిష్ణు జోరు మీదున్నారు. ఆయన తాజా చిత్రం ‘స్వాగ్‌’. ‘రాజ రాజ చోర’ ఫేమ్ హసిత్ గోలి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. రీతూ వర్మ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో మీరా జాస్మిన్ కీలక పాత్ర పోషిస్తున్నారు.

లేటెస్ట్ గా ఈ సినిమా నుంచి మీరా జాస్మిన్  కేరక్టర్ పోస్టర్ విడుదల చేశారు. ఆ లుక్‌లో ఆమె రాణి ఉత్పల దేవిగా కనిపించారు. “ఆమె సానుభూతి స్వభావం, మంచితనం కారణంగా సింహాసనాన్ని కోల్పోయింది” అనే ట్యాగ్‌లైన్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. “ఇది వినూత్నమైన కథాంశంతో రూపొందుతోన్న చిత్రం. ఆద్యంతం వినోదాత్మకంగా ఉంటుంది” అని చిత్రవర్గాలు తెలిపాయి. వివేక్‌ సాగర్ సంగీతం, వేదరామన్‌ శంకరన్‌ ఛాయాగ్రహణం ఈ చిత్రానికి అందిస్తున్నారు.

Leave a comment

error: Content is protected !!