Game changer : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ సినిమా షూటింగ్ ముగింపుకు సిద్ధమవుతోంది. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. కియారా అడ్వాణీ కథానాయికగా నటిస్తుండగా, అంజలి, ఎస్.జె.సూర్య, శ్రీకాంత్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ చిత్రం  కొత్త షెడ్యూల్ ఈ వారం నుండి రాజమండ్రిలో ప్రారంభం కానుంది. దాదాపు వారం పాటు జరగనున్న ఈ షెడ్యూల్ తో చిత్రీకరణ పూర్తి కానుందని తెలుస్తోంది. దీపావళి కానుకగా అక్టోబర్ నెలాఖరున చిత్రం విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ రెండు కోణాలున్న పాత్రలో నటించి మెప్పించనున్నారు. తమన్ సంగీతం అందిస్తుండగా, తిరు ఛాయాగ్రహణం అందిస్తున్నారు.

Leave a comment

error: Content is protected !!