Dulquer Salman : మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన “లక్కీ భాస్కర్” సినిమా సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్రబృందం కొత్త పోస్టర్ ద్వారా తెలియజేసింది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. “గుంటూరు కారం” ఫేమ్ తో పాటు, “సీతారామం” చిత్రంలోనూ నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించిన మీనాక్షి ఈ సినిమాలో దుల్కర్ కి జోడిగా నటించనుంది.

అయేషా ఖాన్ మరొక ముఖ్య పాత్రలో నటించనున్న ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై శివరాజు కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. “లక్కీ భాస్కర్” సినిమా సెప్టెంబర్ 27న థియేటర్లలోకి రావడంతో పాటు, పవన్ కళ్యాణ్ యొక్క “ఓజి” సినిమా కూడా అదే రోజు విడుదల కానుంది. రెండు పెద్ద సినిమాలు ఒకే రోజు విడుదల కావడంతో బాక్సాఫీస్ వద్ద రికార్డుల పోటీ నెలకొనడం ఖాయం.

 

Leave a comment

error: Content is protected !!