Neha shetty :  ‘డీజే టిల్లు’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నేహాశెట్టి, రాధిక పాత్రతో కుర్రాళ్ల మనసుల్లో చెరగని ముద్ర వేసింది. ఇప్పుడు “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” చిత్రంలో విష్వక్ సేన్ తో జోడీ కట్టి బుజ్జి పాత్రలో నటిస్తోంది. ఈ నెల 31న విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రచారంలో భాగంగా నేహాశెట్టి సోమవారం హైదరాబాద్ లో మీడియాతో ముచ్చటించింది. “డీజే టిల్లు” తర్వాత చాలావరకు చీరకట్టుతో కనిపించడం గురించి నేహాశెట్టి మాట్లాడుతూ, “అలాంటి పాత్రలనే ఎంచుకుంటున్నానా లేదా అలాంటివే నా దగ్గరికి వస్తున్నాయా అనేది ఇంకా అర్థం కాలేదు. చిన్న వయసులోనే పరిశ్రమకు వచ్చినాను కాబట్టి, చీరకట్టు పై అవగాహన అంతగా ఉండేది కాదు. కానీ ఇప్పుడు నాకు చాలా సౌకర్యంగా అనిపిస్తోంది. అయితే నా తదుపరి సినిమాలో మాత్రం మోడరన్ లుక్ లో కనిపిస్తాను.” అని చెప్పింది.

90వ దశకపు నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో నేహాశెట్టి ధనవంతుల కుటుంబానికి చెందిన ఓ పల్లెటూరి అమ్మాయి “బుజ్జి” పాత్రలో నటిస్తుంది. “ట్రైలర్ లో అందంగా, సౌమ్యంగా కనిపించినా, సినిమాలో ఈ పాత్ర చాలా భావోద్వేగాలతో కూడిన శక్తిమంతమైన పాత్ర. చుట్టూ ఆశ్చర్యకరమైన విషయాలు చాలా జరుగుతాయి.” అని వివరించింది. ఈ పాత్ర కోసం నేహాశెట్టి ముఖ్యంగా శోభన లుక్ , ఆమె నటనను రిఫరెన్స్ గా తీసుకుంది.

“అప్పటి పరిస్థితులకు తగ్గట్టుగా నా ఆహార్యాన్ని మార్చుకున్నాను. అప్పటి కథానాయికల్లాగా కళ్లతోనే హావభావాలు పలికించే ప్రయత్నం చేశాను. యాస విషయానికి వస్తే, అంతగా సన్నద్ధం కావాల్సిన అవసరం రాలేదు.” అని చెప్పింది.  “డీజే టిల్లు” తర్వాత నుంచి నేహాశెట్టిని చాలా మంది రాధిక అని పిలుస్తూ ఉండటం గురించి మాట్లాడుతూ, “దాన్ని నేను గౌరవంగా భావిస్తాను. ఒక నటుడికి పోషించిన పాత్ర పేరుతో పిలవడం అనేది చాలా గొప్ప ప్రశంస. షారుక్ ఖాన్ ను బాద్షా అని పిలిచినంత ఆనందంగా నాకు అని చెప్పింది.

Leave a comment

error: Content is protected !!