Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న హై యాక్టిన్ యాక్షన్ మూవీ పుష్ప 2. మొదటి భాగం పాన్ ఇండియా రేంజ్ లో దుమ్మురేపడంతో .. రెండో భాగంపై విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. ఈ ఏడాది ఆగస్ట్ 15న ఈ సినిమాను రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ ను కూడా ముమ్మరం చేశారు. అందులో భాగంగా .. ఇప్పటికే రెండు టీజర్స్ విడుదల చేయగా.. ఇప్పుడు ఒకో సింగిల్ వదులుతున్నారు.

ఇంక ఈ సినిమాలో సిద్ధప్ప పాత్రలో అదరగొట్టిన రావు రమేశ్ పాత్ర పుష్ప2 లో కంటిన్యూ అవుతోంది. ఒక నియోజకవర్గానికి యమ్మెల్యేగానూ, ఆ ప్రాంతంలో దందాలు జరిపించే కింగ్ పిన్ గా సత్తా చాటుకున్నారు. ఈ పాత్ర రెండో భాగంలో అత్యంత కీలకం కాబోతోంది. ఈ రోజు రావురమేశ్ పుట్టిన రోజు సందర్భంగా సిద్ధప్ప పాత్ర లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. అగ్రెసివ్ లుక్ లో ఆయన అద్భుతంగా రివీల్ అయ్యారు. దీనికి మంచి స్పందన లభిస్తోంది.

Leave a comment

error: Content is protected !!