Nagachaitanya : ప్రభాస్ నటించిన “కల్కి 2898 AD” సినిమా కోసం ప్రత్యేకంగా రూపొందించిన కారు బుజ్జి. మూడు టైర్లు, ఆరు టన్నుల బరువుతో ఈ కారు ఒక ఇంజనీరింగ్ అద్భుతం. రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ కారును ఆవిష్కరించారు. సినిమాలో ఈ బుజ్జి కారు కీలక పాత్ర పోషిస్తుంది. ప్రభాస్ పోషిస్తున్న భైరవ పాత్రతో కలిసి బుజ్జి చేసే విన్యాసాలు అద్భుతంగా ఉంటాయని చిత్రబృందం చెబుతోంది. ఈ కారును రూపొందించడానికి దాదాపు రూ.7 కోట్లు ఖర్చయ్యింది. మాటలు కూడా నేర్చుకున్న ఈ కారును తెరపై చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
వాహనాల ప్రియుడైన నాగచైతన్య ఈ బుజ్జి కారును నడిపి షికారు చేశారు. కార్ రేసింగ్, బైక్ రేసింగ్‌లో ఆసక్తి ఉన్న నాగచైతన్య ఈ కారును నడపడం ఒక అద్భుతమైన అనుభవం అని చెప్పారు. “కల్కి” చిత్రబృందం ఇంజనీరింగ్ రూల్స్‌ను బద్దలు కొట్టిందని, ఈ కారు ఒక ఇంజినీరింగ్ మార్వెల్ అని ఆయన ప్రశంసించారు. ప్రభాస్ కథానాయకుడిగా నటించిన ఈ “కల్కి 2898 AD” సినిమాను వైజయంతీ మూవీస్ పతాకంపై నిర్మించారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.