Shirin Sriram : శిరిన్ శ్రీరామ్ కేఫ్ బ్యానర్‌పై అనురూప్ రెడ్డి, దేవా మలిశెట్టి, సారిక, మానస ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ప్రేమించొద్దు. శిరీన్ శ్రీరామ్ దర్శకత్వ, నిర్మాణంలో ఈ సినిమా రూపొందింది. ఐదు భాషల్లో రూపొందిన ఈ పాన్-ఇండియన్ చిత్రం తెలుగు వెర్షన్ జూన్ 7న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తన కథను కాపీ కొట్టి సాయి రాజేష్ బేబీ సినిమాగా తీయడంపై శిరిన్ శ్రీరామ్ మరోసారి రియాక్ట్ అయ్యాడు. సాయి రాజేష్ చేసిన దగా, దానికి సంబంధించిన ఆధారాలు బేబీ లీక్స్ పేరుతో పుస్తకంగా తీసుకొచ్చాడు. ఈ పుస్తకాన్ని మీడియా ముందు ఉంచాడు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో…

2015లో రవి కిరణ్ ఫేస్ బుక్‌లో పెట్టిన ఓ అమ్మాయిని ఇద్దరబ్బాయిలు కలిసి చంపారనే పోస్ట్ చూసి దాన్ని ఓ బస్తీ అమ్మాయి పాత్రతో లింక్ చేసి కథ రాసుకున్నా. ఆ టైంలో నిర్మాత సాయి రాజేష్ తో ఏడాది ప్రయాణం చేశాను. నాకు దర్శకుడిగా అవకాశం ఇస్తూ ఆయనే సినిమాను నిర్మిస్తానని అన్నారు. అయితే ఆలస్యం అవుతూ వచ్చింది. కారణాలేమైనా ఆయన సినిమా నిర్మించడం లేదని నేను బయటకు వచ్చేశాను. అప్పుడు మాకేం గొడవ జరగలేదు. త‌ర్వాత నాకు ద‌ర్శక‌త్వం అవ‌కాశం ఇస్తాన‌న్నవాడు.. నా క‌థ‌ను కాపీ కొట్టి అదే బస్తీ అమ్మాయి.. ఇద్దరబ్బాయిల్ని ప్రేమించే కథతో బేబీ అనే ఓ బూతు సినిమా తీశాడు.

2023 జూలైలో సినిమా రిలీజ్ అయినప్పుడు రచ్చ చేయలేదు. నాకు రియలైజ్ అవ్వడానికి చాలా టైం పట్టింది. సాక్ష్యాలు అన్నీ సంపాదించి లాయర్ నిఖిలేష్ గారిని కలిశాను. కాపీరైట్ లీగల్ నోటీస్ పంపాం. కానీ నాకే ఆయన ఆ కథను చెప్పాడని ఆ నోటీసులో రిప్లై ఇచ్చాడు. హృదయ కాలేయం సినిమాకు ఫ్రీగా టీజర్ డైరెక్ట్ చేసి, ఎడిట్ చేసి ఇచ్చాను. సాయం చేసిన వాళ్లకే వెన్నుపోటు పొడిచే రకం. ఫిబ్రవరిలో రాయదుర్గంలో కేస్ ఫైల్ చేశాను. ఆయన మీద బేబీ లీక్స్ అనే పుస్తకాన్ని కూడా రాశాను. దాన్ని మీడియా ముందుకు తీసుకొస్తున్నాను అని శిరిన్ శ్రీరామ్ అన్నారు.

 

Leave a comment

error: Content is protected !!