Ashwini Nambiar : ఈమధ్య సిల్వర్ స్ర్కీన్ సుందరీ మణులతో పాటు.. బుల్లితెర బ్యూటీస్ కూడా తమ అందాలతో వావ్ అనిపిస్తున్నారు. తమ సోయగాలతో హీరోయిన్స్ కే సవాల్ విసు రుతున్నారు. సీరియల్స్ లో ఇప్పటికే ఎంతో మంది అందాల భామలున్నారు. అలాంటి వాళ్ళకు సినిమాల్లో గుర్తింపు రాకపోయినా.. వయసుతో సంబంధం లేకుండా.. సోషల్ మీడియాలో అందరి అటెన్షన్ ను తమవైపుకు తిప్పు కుంటున్నారు. పై ఫోటోలో కనిపిస్తున్న బ్యూటీని గుర్తు పట్టారా? ఈమె సీరియల్స్ లో సావిత్రి టైపు. కానీ సోషల్ మీడియాలో మాత్రం .. వామ్మో అనిపిస్తోంది.

ఈ బ్యూటీ మరెవరో కాదు. అశ్విని నంబియార్. ఈ మల్లూ భామ.. టీవీ సిరీయల్స్ లో సాత్వికమైన పాత్రలతో మహిళా ప్రేక్షకుల్ని ఏడిపిస్తూంటుంది. తెలుగుతో పాటు, తమిళ, మలయాళ భాషల్లో పలు చిత్రాల్లో నటించింది. సీనియర్ తమిళ దర్శకుడు భారతిరాజా ఆమెను తెరపైకి తెచ్చారు. హిట్లర్ తెలుగు సినిమాలో చిరంజీవి చెల్లెలిగా నటించి మెప్పించింది. చివరిగా శ్రీహరితో ఒక పోలీస్ సినిమాలో నటించింది. ఇప్పుడు ఇలా సోషల్ మీడియాను తన అందాల సునామీతో ముంచెత్తుతోంది. ఆమె గ్లామర్ కు కుర్రకారు షాకవుతున్నారు.

Leave a comment

error: Content is protected !!