Balakrishna : పెళ్ళయి , ఒక బిడ్డకు తల్లైన తర్వాత నుంచి కూడా కాజల్ అగర్వాల్ .. టాలీవుడ్ లో వరుసగా సినిమాలకు సైన్ చేస్తుండడం విశేషం. ఈ క్రమంలో ఆమె నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ మూవీ సత్యభామ. ఈ సినిమా ట్రైలర్ ను లేటెస్ట్ గా లాంచ్ కోసం  హైదరాబాద్‌లో ఈవెంట్ నిర్వహించారు. బాలకృష్ణ రాక ఈ ఈవెంట్‌ను ప్రత్యేకంగా చేసింది. ఎన్నికల ప్రచారం కారణంగా కెమెరా ముందుకు రావడం మిస్ అయ్యానని, ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు హాజరు కావడం సంతోషంగా ఉందని బాలకృష్ణ చెప్పారు.

“సత్యభామ పేరు వినగానే వైబ్రేషన్ వస్తుంది. పోలీస్ పాత్రలో ఫైట్లు చేస్తూ కాజల్ అద్భుతంగా కనిపిస్తోంది. ఆమె పాత్రలో ఓ యాటిట్యూడ్ కూడా ఉంది. సత్యభామకు అవసరమైన అన్ని ఇంగ్రేడియెంట్స్  ఉన్నాయని నేను ఆశిస్తున్నాను. సత్యభామ ఘన విజయం సాధిస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. నేను ఛాయాగ్రాహకుడికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. ఎందుకంటే దర్శకుడి దృష్టిని తెరపై ప్రదర్శించేది ఛాయాగ్రాహకుడే. నేను మొదట ఛాయాగ్రాహకుడిని కావాలనుకున్నాను” అని బాలకృష్ణ చెప్పారు.

“శ్రీచరణ్ మంచి సంగీత దర్శకుడు. తెలుగు చలన పరిశ్రమ ప్రస్తుతం భారతీయ సినిమాలో టాప్‌లో ఉంది. సత్యభామ ట్రైలర్ రాక్‌సాలిడ్‌గా ఉంది. కాజల్ ఎలాంటి పాత్రనైనా చేయగల ఫైర్‌బ్రాండ్. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత మళ్లీ ఇండస్ట్రీకి వచ్చింది. కాజల్ ఎనర్జిటిక్ నటి. తెలుగు నటీనటులు ఎన్టీఆర్ గారి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు, అందుకు నేను సంతోషిస్తున్నాను. అన్నారు.

Leave a comment

error: Content is protected !!