Ashika Ranganath : కన్నడ నటి ఆషిక రంగనాథ్, నందమూరి కళ్యాణ్ రామ్‌తో కలిసి అమిగోస్‌లో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. తరువాత నాగార్జున నా సామి రంగాలో నటించిన పాత్రకు గుర్తింపు పొందింది. ఇటీవల కన్నడ థ్రిల్లర్ O2లో కనిపించిన ఆషిక… మెగాస్టార్ చిరంజీవి విశ్వంభరలో భాగం కానున్నట్లు  మొన్నామధ్య ఒక ఇంటర్వ్యూ లో కన్ఫమ్ చేసింది. ఇక లేటెస్ట్ గా  విశ్వంభర టీమ్ కూడా ఈ విషయాన్ని కన్ఫామ్ చేస్తూ ఓ పోస్టర్ కూడా వదిలారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన పాత్ర కథకు ఎంతో కీలకమని చెప్పారు. తను చిరంజీవి సరసన నటించడం లేదని, కానీ ఇంత పెద్ద ప్రాజెక్ట్‌లో పాల్గొనడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. త్రిష హీరోయిన్ గా నటిస్తు్న్న విశ్వంభర 2025 జనవరి 10న థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రంలో రమ్య పసుపులేటి, ఈషా చావ్లా, అష్రిత వేముగంటి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యువి క్రియేషన్స్‌ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రానికి ఆస్కార్‌ అవార్డు గెలుచుకున్న సంగీత దర్శకుడు యమ్.యమ్. కీరవాణి సంగీతం అందించారు.

 

Leave a comment

error: Content is protected !!