Vishnuvardhan Reddy : విష్ణువర్ధన్ రెడ్డి – ఈ పేరు వినగానే గుర్తుకు వచ్చేది ఏమిటి? సినిమా పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్లు. అవును, ఈ కళాకారుడు సినీ పరిశ్రమకు చెందిన ఒక ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్. ‘వివ‌’ అనే ఓ చిన్న పేరుతో పిలువబడే ఈ యువకుడు ఈ రోజు తన 25 ఏళ్ల కళా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నాడు. వరంగల్‌కు చెందిన మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన విష్ణువర్ధన్ చిన్నప్పటి నుంచే చిత్రలేఖనంలో అద్భుతమైన ప్రతిభ కనబరిచాడు. స్కూల్లో చదువుతున్నప్పుడే డ్రాయింగ్ పోటీల్లో ఫస్ట్.

హైదరాబాద్‌కు వచ్చి జేఎన్‌టీయూలో బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (BFA) పూర్తి చేశాడు. ఆ సమయంలోనే అతను హైదరాబాద్‌లో జరిగే కళా ప్రదర్శనలకు హాజరయ్యేవాడు. అక్కడే ప్రముఖ చిత్రకారుడు లక్ష్మణ్ ఏలే, పబ్లిసిటీ డిజైనర్ ధని ఏలే వంటి వారితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయాలే అతని కెరీర్‌కు మలుపు తిప్పాయి. దిల్ సినిమా లోగోతో సినీ డిజైనర్ కెరీర్ ప్రారంభించిన‌ విష్ణువ‌ర్థ‌న్ రెడ్డి.. పాతికేళ్ల కెరీర్‌లో ఇప్పటివరకు 500 పైగా సినిమాలకు లోగో డిజైన్ చేశాడు. పబ్లిసిటీ డిజైనర్‌గా మొదటి సినిమా ‘బంగారు కొండ’. వంద‌ సినిమాలకు పైన పబ్లిసిటీ డిజైనర్‌గా చేశాడు. బంగారుకొండ‌, పోకిరి, దూకుడు, అర్జున్, బొమ్మ‌రిల్లు, చంద్ర‌ముఖి, వినాయకుడు, దొంగోడు, ముహూర్తం, జై బోలో తెలంగాణ‌, ఆర్య‌2, ఆయుధం, దేశ‌ముదురు, కిత‌కిత‌లు, డాన్ శీను, ప‌రుగు, ప్ర‌స్థానం, ర‌క్త చ‌రిత్ర‌, శివ‌మ‌ణి, ‘ సింహ, సర్కారు నౌకరి, రెడీ, ఢీ డాన్స్ షో లోగో.. ఇలా ఎన్నో సినిమాల‌కు, టీవీ సీరియ‌ల్‌ల‌కు, షోల‌కు లోగోల‌ను రాశాడు. స్టార్ హీరోల‌కు వివ అందించిన లోగోలు ఎంతో పేరు తెచ్చిపెట్టాయి. దర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు, వంశీ లాంటి ద‌ర్శ‌కులు పిలిపించుకుని ప్ర‌శంసించారు. అవ‌కాశాలు ఇచ్చారు. దాసరి “పరమవీరచక్ర” , వంశీ ” గోపి గోపిక గోదావరి” సినిమాలకు లోగోలు రాయించుకొని వివ‌రెడ్డికి మంచి భ‌విష్య‌త్ ఉందంటూ ప్రశంసించారు. ‘దేశ‌ముదురు’, ‘పోకిరీ’, ‘డాన్ శీన్’, ‘ఆర్య‌2’, ‘అప్ప‌ల్రాజు’, ‘శివ‌మ‌ణి’, ‘ఏకల‌వ్‌యుడు’, ‘దొంగోడు’, ‘ఆగ‌డు’..వంటి పెద్ద సినిమాలకు పనిచేసి తన ప్రతిభను చాటుకున్నాడు.

Leave a comment

error: Content is protected !!