Kajal Agarwal : 2015లో విడుదలైన “బ్రహ్మోత్సవం” సినిమా మహేష్ బాబు కెరీర్ లోనే దారుణమైన ఫ్లాప్ గా నిలిచింది. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ, సినిమా విడుదలైన తర్వాత మాత్రం దారుణమైన టాక్ తో ప్రేక్షకులను.. ముఖ్యంగా మహేష్ బాబు అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది.

ఈ డిజాస్టర్ గురించి మాట్లాడకుండా జాగ్రత్తగా ఉండే మహేష్ బాబు అభిమానులకు.. కాజల్ అగర్వాల్ షాక్ ఇచ్చింది. తనకు ఇష్టమైన సినిమాల్లో “బ్రహ్మోత్సవం” ఒకటి అని ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. నిజానికి ఈ సినిమాలో కాజల్ పాత్ర చాలా చిన్నది, సినిమాలో సమంతా మెయిన్ హీరోయిన్. ఈ విషయం తెలిసిన అభిమానులు ఆశ్చర్యపోయారు.

అయితే, కాజల్ ఈ విషయం చెప్పడానికి ఒక కారణం ఉండవచ్చు. ఈ నెల 31న విడుదల కాబోతున్న “సత్యభామ” సినిమా ప్రమోషన్లో భాగంగా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పింది. “సత్యభామ” సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కాజల్ నటించింది. ఈ సినిమాకు గూఢచారి, మేజర్ ఫేమ్ శశికిరణ్ తిక్కా స్క్రీన్ ప్లే రాశారు, శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు. పెళ్లి తర్వాత కొంతకాలం బ్రేక్ తీసుకున్న కాజల్, “సత్యభామ” సినిమాతో తిరిగి బలంగా రావాలని ఆశిస్తుంది. “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” లాంటి పోటీ ఉన్నా సరే, “సత్యభామ” బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తుందని చిత్ర యూనిట్ నమ్ముతోంది.

Leave a comment

error: Content is protected !!