Mrunal Thakur : మృణాల్ ఠాకూర్ ‘సీతారాం’, ‘హాయ్ నాన్న’ చిత్రాల విజయాలతో తన సత్తా చాటింది. అయితే ఈమె రీసెంట్ గా నటించిన ‘ఫ్యామిలీ స్టార్’ ఆశించిన ఫలితం రాలేదు. ఆ తర్వాత ఆమె నుంచి ఎలాంటి కొత్త సినిమా విశేషం వినిపించలేదు .
అయితే ఇప్పుడు ఆమె సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో ఓ హిందీ సినిమాలో నటించనుందని సమాచారం. “మామ్” సినిమాతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన రవి ఉద్యావర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నట్టు టాక్. ప్రధాన పాత్రలో సిద్ధాంత్ చతుర్వేది నటించనున్నారు.
ఇది డిఫరెంట్ రొమాంటిక్ డ్రామా అని తెలుస్తోంది. అంతేకాదు దీనికి భన్సాలీ స్వయంగా సంగీతం అందించనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ జూన్లో ప్రారంభం కానుంది.