Anikha Surendran : బాల నటిగా తెరంగేట్రం చేసిన అనికా సురేంద్రన్ ‘విశ్వాసం’, ‘క్వీన్’, ‘ది ఘోస్ట్’ లాంటి చిత్రాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం హీరోయిన్ గా పరిచయం కావడంతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ హాట్ ట్రీట్ లు ఇస్తూ ఉంటుంది.

డిజైనర్ దుస్తులు, చిట్టిపొట్టి నిక్కర్లలో సెగలు పుట్టించే భంగిమలతో తన అందాన్ని చాటుకుంటూ ఫాలోయింగ్ పెంచుకుంటోంది. అయితే, సోషల్ మీడియాలో పాజిటివ్ తో పాటు నెగిటివ్ కామెంట్లు కూడా ఎదుర్కొంటూ ఉంటుంది. డ్రెస్సింగ్ సెన్స్ పై విమర్శలు, ట్రోలింగ్ తో బాధపడుతున్న అనికా తాజాగా ఈ విషయంపై స్పందించింది.

“చిత్రసీమలో ఇలాంటి విమర్శలు నటీమణులు ఎదుర్కోవడం సహజం. ఆకర్షణీయంగా దుస్తులు ధరించడం నా వ్యక్తిగత విషయం. నా స్టైలింగ్ నా ఇష్టం. విమర్శించారని నా ఇష్టాన్ని పక్కన పెట్టలేను. ఈ విమర్శలు వస్తాయి, పోతాయి. ఇవన్నీ జీవితంలో ఒక భాగం మాత్రమే. కామెంట్ చేయాలనే ఉద్దేశం ఉన్నవారు చీర కట్టుకున్నా కామెంట్స్ చేస్తారు. అయితే నా దుస్తుల విషయంలో కొందరు చేసే కామెంట్లు నన్ను చాలా ప్రభావితం చేస్తాయి. నేను కూడా మనిషినే. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే తట్టుకోవడం కష్టంగా ఉంటుంది. దయచేసి కామెంట్లు చూసుకుని పెట్టండి. వ్యక్తిగత విషయాలు వద్దు” అని అనికా ఎమోషనల్ గా స్పందించింది.

Leave a comment

error: Content is protected !!