Kajal Agarwal : ఒకప్పుడు హీరోయిన్స్ పెళ్లి చేసుకుంటే వారి కెరీర్ ముగిసిపోయిందని అనుకునేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి చాలా మారిపోయింది. పెళ్లి తర్వాత కూడా చాలా మంది హీరోయిన్స్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. వారిలో కాజల్ అగర్వాల్ ఒకరు. తన బాబు పుట్టిన తర్వాత కూడా తన కెరీర్ పై దృష్టి పెడుతూ వరుసగా సినిమాలతో బిజీగా ఉన్నారు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో కాజల్ మాట్లాడుతూ, బాలీవుడ్ తో పోలిస్తే టాలీవుడ్ లో పెళ్లయిన హీరోయిన్లకు అవకాశాలు తక్కువగా వస్తాయని అభిప్రాయపడ్డారు. అయితే ఇప్పుడిప్పుడే ఈ పరిస్థితి మారుతోందని, దానికి తానే ఒక ఉదాహరణ అని చెప్పారు. పెళ్లి తనను వ్యక్తిగతంగా, వృత్తిపరంగా పెద్దగా మార్చలేదని కూడా కాజల్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ‘సత్యభామ, ఇండియన్ 2, కన్నప్ప’ సినిమాలతో బిజీగా ఉంది. వీటిలో ‘సత్యభామ, ఇండియన్ 2’ చిత్రాలు విడుదలకు రెడీగా ఉన్నాయి.