Good Bad Ugly : స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రం ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ తెలుగు-తమిళ ద్విభాషా చిత్రానికి ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2025 సంక్రాంతికి విడుదల కానుంది. మూడు డిఫరెంట్ వేరియేషన్స్ లో అజిత్ లుక్ అదిరిపోయింది. వైబ్రెంట్ అవుట్ ఫిట్స్, చేతినిండా టాటూస్, షేడ్స్ ధరించి, ఎదురుగా ఉన్న వెపన్స్ తో స్టైలిష్ గా కనిపించారు.
ఈ ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలను భారీగా పెంచింది. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం, అభినందన్ రామానుజం సినిమాటోగ్రఫీ, విజయ్ వేలుకుట్టి ఎడిటింగ్ అందిస్తున్నారు ఇండియన్ సినిమాలోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌లలో ఒకటిగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రం 2025 సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అజిత్ అభిమానులు ఈ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.