Bharateeyudu 2 : క‌మ‌ల్ హాస‌న్, దర్శకుడు శంక‌ర్ కాంబినేష‌న్‌లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం “భార‌తీయుడు 2”. 1996లో విడుదలై బాక్సాఫీస్‌ను దున్నేసిన “ఇండియన్” సినిమాకు సీక్వెల్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ బ్యానర్‌లపై సుభాస్కర‌న్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

“భార‌తీయుడు 2” సినిమా ప్రమోషన్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ముంబైలోని స్టార్ స్పోర్ట్స్ ఛానల్‌లో ఈ చిత్రం ప్రమోషన్స్ ప్రారంభమయ్యాయి. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అవినీతికి వ్యతిరేకంగా పోరాడే క‌మ‌ల్ హాస‌న్ పాత్ర, శంక‌ర్ దర్శకత్వం ప్రేక్షకులను ఆకట్టుకునేలా  ఉంటాయి. ఈ చిత్రం బాక్సాఫీస్‌ను శాసించే అవకాశం ఉంది.

“భార‌తీయుడు 2” కథ అవినీతికి వ్యతిరేకంగా పోరాడే స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు సేనాప‌తి పాత్రలో క‌మ‌ల్ హాస‌న్ నటిస్తున్నారు. జూన్ 1న చెన్నైలో ఈ చిత్రం ఆడియో వేడుక గ్రాండ్ గా జరగబోతోంది. “భార‌తీయుడు 2″లో క‌మ‌ల్ హాస‌న్‌తో పాటు ఎస్‌.జె.సూర్య, ప్రియా భ‌వానీ శంక‌ర్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, సిద్ధార్థ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్‌ తదితెర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను జూలైలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

 

Leave a comment

error: Content is protected !!