వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి నటించిన “సిల్క్ శారీ” సినిమా ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ఈవెంట్ లో ముఖ్య అతిథులుగా నటుడు మురళీ మోహన్, హీరో శ్రీకాంత్, నటులు శివాజీ రాజా, ఉత్తేజ్ పాల్గొన్నారు.
ఈ చిత్రాన్ని చాహత్ బ్యానర్ పై కమలేష్ కుమార్ నిర్మిస్తున్నారు. దర్శకుడు టి. నాగేందర్ కొత్త రొమాంటిక్ లవ్ స్టోరీ గా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రం ఈ నెల 24న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రానుంది.
ఈ చిత్రం ట్రైలర్, పోస్టర్లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Leave a comment

error: Content is protected !!