సపోర్టింగ్ ఆర్టిస్ట్‌గా మారి మంచి పాత్రలు పోషిస్తున్న టబు, తెలుగు ప్రేక్షకులకు “నిన్నే పెళ్లాడతా” సినిమాలో తన నటనతో ఎప్పటికీ గుర్తుండిపోయారు. వెంకటేష్ తో “కూలి నెంబర్ వన్” తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత హిందీలో సెటిలైన టబు, ఇక్కడ ఎక్కువగా నటించలేకపోయారు. చిరంజీవి “అందరివాడు”, బాలకృష్ణ “పాండురంగడు” సినిమాల్లో నటించినా, ఆ సినిమాలు ఆశించినంత విజయం సాధించలేదు. కానీ, సుదీర్ఘమైన గ్యాప్ తర్వాత, అల్లు అర్జున్ “అల వైకుంఠపురములో” సినిమాతో ట్రివిక్రమ్ శ్రీనివాస్ టబును తిరిగి తెలుగు సినిమాల్లోకి తీసుకొచ్చారు. ఇప్పుడు, టబు హాలీవుడ్‌లోకి అడుగు పెట్టబోతోంది.
ప్రపంచవ్యాప్తంగా అభిమానులను కలిగి ఉన్న “డ్యూన్” సిరీస్ లో, టబు “సిస్టర్ ఫ్రాన్సెస్” అనే కీలక పాత్ర పోషించబోతోంది. 10 వేల సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనల నేపథ్యంలో రూపొందుతున్న ఈ స్కైఫై చిత్రానికి భారీ బడ్జెట్ కేటాయించబడింది. డ్యూన్ సిక్వెల్ కంటే ఐదు రెట్లు ఎక్కువ ఖర్చుతో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. టబు ఈ చిత్రానికి ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంటుంది.
బాలీవుడ్ నటులు ఇంగ్లీష్ సినిమాల్లో నటించడం కొత్తేమి కాదు. గతంలో అమ్రిష్ పూరి, ఇర్ఫాన్ ఖాన్, అనీల్ కపూర్, ఓంపూరి తదితరులు ప్రత్యేక పాత్రల్లో నటించారు. కానీ, వారు ఎంత హిట్ అయినా, అక్కడ కొనసాగలేక తిరిగి భారతదేశానికి వచ్చారు. టబుకు ఎలాంటి గుర్తింపు వస్తుందో చూడాలి. “భూల్ భులాయ్యా 2” లో డబుల్ రోల్ లో దెయ్యంగా టబు అద్భుతమైన నటన కనబరిచిన తర్వాతే ఈ ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది. ఈ వయసులో ఇంత గొప్ప కెరీర్ బ్రేక్ అందుకోవడం చాలా అరుదు. టబుకు అదృష్టం కలిసి వచ్చిందని చెప్పవచ్చు.