Devara movie : ఎన్టీఆర్ పుట్టినరోజు నాడు “దేవర” సినిమా టైటిల్ సాంగ్ లిరికల్ వీడియోను విడుదల చేస్తున్నట్టు  ముందు నుంచే ప్రచారం జరుగుతోంది. కానీ, ఆ పాటకు సంబంధించి ఒక వెర్షన్ కట్ చేసి, మరొక వెర్షన్ కూడా రెడీ చేస్తున్నారని టాక్ నడుస్తోంది. ఈ రెండో వెర్షన్ బాగుంటేనే పాటను విడుదల చేస్తారట. లేదంటే, ముందుగా పాట ప్రోమోను విడుదల చేసి, ఆ తర్వాత కొద్ది రోజుల గ్యాప్ తో టైటిల్ సాంగ్ లిరికల్ వీడియోను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.  లేటెస్ట్ గా ఈ నెల 19న టైటిల్ సాంగ్ ..  ఫియర్ సాంగ్  ను విడుదల చేస్తున్నట్టు అదిరిపోయే ఒక పోస్టర్ తో  మేకర్స్ ప్రకటించారు. అనిరుధ్ రవిచంద్రన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు.

ఈ సినిమాలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కోసం చాలా పెద్ద షెడ్యూల్ ప్లాన్ చేశాడు డైరెక్టర్ కొరటాల శివ. దీంతో, సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఎన్టీఆర్ ఈ సినిమాలో అదిరిపోయే లుక్లో కనిపించబోతున్నారని టాక్. ఈ పాత్ర కోసం తారక్ డిఫరెంట్ మేకోవర్ ట్రై చేస్తున్నారట. మొత్తం మీద, “దేవర” సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి.

Leave a comment

error: Content is protected !!