Bukka pakir teaser  : అనిల్, నందిని హీరోహీరోయిన్లుగా అనిల్ వాటుపల్లి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ “బుక్కా పకీర్”. లేటెస్ట్ గా ఈ సినిమా టీజర్ విడుదలైంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా చిత్ర దర్శక నిర్మాత అనిల్ వాటుపల్లి మాట్లాడుతూ: “ఇది ఒక డిఫరెంట్ యాక్షన్ ఎంటర్టైనర్. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. అన్ని హంగులతో జూన్ నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాము” అన్నారు. అనిల్, నందిని, త్రివేణి, స్వాతి, శ్రీను, వెంకీ, రామచంద్ర, రాజేంద్ర, లోబో తదితరులు నటించారు.

Leave a comment

error: Content is protected !!