Gamechanger : రామ్ చరణ్ , శంకర్ కాంబో లో పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న చిత్రం గేమ్ చేంజర్ . భారీ హంగులు, అద్భుతమైన దృశ్యాలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయడంలో శంకర్ దిట్ట. అందుకే ఈ సినిమా చిత్రీకరణ ఆలస్యమవుతూ వచ్చింది.

కొంతకాలంగా ఈ సినిమాపై ప్రత్యేకంగా దృష్టి సారించిన రామ్ చరణ్, చిత్రీకరణను శరవేగంగా పూర్తి చేయడానికి కృషి చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చివరి దశ చిత్రీకరణ జరుగుతోంది. ఇటీవలే రామోజీ ఫిల్మ్‌సిటీలో కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించారు. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో రామ్ చరణ్, ఇతర నటీనటులపై సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.

ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తోంది. దిల్‌రాజు, శిరీష్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెలలోనే చిత్రీకరణను పూర్తి చేసుకోనుంది. “గేమ్ ఛేంజర్” పూర్తయిన వెంటనే, రామ్ చరణ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కనున్న తన తదుపరి చిత్రం కోసం సిద్ధంగా ఉన్నారు. ఈ చిత్రం ఇప్పటికే లాంఛనంగా ప్రారంభమైంది.

Leave a comment

error: Content is protected !!