Shiva Mallala : హమారేష్, ప్రార్థన సందీప్ జోడీగా నటించిన వెరైటీ మూవీ సత్య (Satya). తమిళంలో రంగోలి గా రిలీజై సూపర్ హిట్టైంది. ఇది వరకు విడుదలైన పోస్టర్లు, టీజర్‌ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. శివమ్ మీడియా సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మే 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. రీసెంట్ గా సత్య మూవీ ట్రైలర్‌ను 8 మంది దర్శకుల సమక్షంలో విడుదల చేశారు.

ఈ సినిమా డబ్బింగ్ సినిమానే అయినప్పటికీ… అచ్చమైన తెలుగు సినిమా లా ఉంటుందని నిర్మాత శివ మల్లాల తెలిపారు. అలాగే.. డబ్బింగ్ కోసం ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా 12 లక్షలు ఖర్చుపెట్టినట్టు వెల్లడించారు. ఈ సినిమా కోసం నన్ను సపోర్ట్ చేసిన దిల్ రాజు గారికి అదేవిధంగా మొన్న పిలవగానే ఈవెంట్ కి వచ్చిన దర్శకులకి, ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అన్నారు.

 

 

 

 

Leave a comment

error: Content is protected !!