Divya Nagesh : అనుష్క నటించిన అరుంధతి సినిమా ఎంతటి విజయవంతమైందో చెప్పనక్కర్లేదు. అనుష్క కెరీర్ లోనే కాకుండా టాలీవుడ్ సినీ చరిత్రలోనే ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా అది. అలాంటి సినిమాలో చిన్నప్పటి అనుష్క పాత్రలో నటించిన దివ్య నగేష్ ను ఎవరూ మరిచిపోలేరు.

కేరళకు చెందిన  దివ్య నగేష్ 2014లో “సేవమ్” తమిళ చిత్రం తో బాల నటిగా సినీరంగ ప్రవేశం చేసి, చిన్నతనంలోనే విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అరుంధతి తర్వాత ఆమెకు మరింత పాపులారిటీ వచ్చింది. కానీ అదృష్టం కలిసి రాకపోవడంతో ఆ తర్వాత ఎక్కువ ఆఫర్లు రాలేదు. వయసు పెరగడం వల్ల బాల నటిగా ఆఫర్లు తగ్గడంతో హీరోయిన్ గా సినిమాలు చేసేందుకు సిద్ధం అయ్యింది. అయినా ఆమెకు అవకాశాలు రాలేదు. రెండు మూడు సినిమాల్లో హీరోయిన్ గా నటించినప్పటికీ, సోషల్ మీడియాలో సందడి చేయడం తప్ప హీరోయిన్ గా పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది.

అరుంధతిలో చిన్నారి అనుష్క గా బాగా పాపులర్ అయిన దివ్య నగేష్ ను తెలుగు ప్రేక్షకులు ఇతర హీరోల సరసన హీరోయిన్ గా ఒప్పుకోవడం లేదు. కాస్త బొద్దుగా ఉండటం కూడా ఆమెకు ప్రతికూల అంశంగా మారింది. ఇప్పటికే మూడు పదుల వయసు దాటిన దివ్య నగేష్ మళ్లీ సినిమాల్లో నటించే అవకాశాలు చాలా తక్కువ. హీరోయిన్ గా కాకపోయినా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఏమైనా ఆఫర్లు వస్తాయేమో చూడాలి.

Leave a comment

error: Content is protected !!