యదార్థ సంఘటనల ఆధారంగా.. 100 క్రోర్స్ అనే వినోదాత్మక చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రాన్ని SS స్టూడియోస్ బ్యానర్‌పై దివ్య కార్తీక్ మరియు సాయి కార్తీక్ నిర్మించారు విరాట్ చక్రవర్తి రచన మరియు దర్శకత్వం వహించారు. రాహుల్, చేతన్, యామి, సాక్షి చౌదరి, లహరి, అన్నపూర్ణమ్మ, ఐశ్వర్య, భద్రమ్, ఇంటూరి వాసు, సమీర్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు.

ఈ సినిమా ఫస్ట్ పోస్టర్ ఇటీవలే విడుదలైంది. లేటెస్ట్ గా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దర్శకులు వీరశంకర్, మల్లిక్ రామ్, నిర్మాత హర్షిత్ రెడ్డి, నిర్మాత దామోదర ప్రసాద్ హాజరై తొలి పోస్టర్‌ను విడుదల చేశారు. తర్వాత ఫిల్మ్ యూనిట్ కి బెస్ట్ విషెస్ తెలిపారు. ఇక ‘100 కోట్లు’ అనే టైటిల్ తో సినిమాపై ఆసక్తి పెరిగింది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా చాలా కొత్తగా ఉంది.

Leave a comment

error: Content is protected !!