నాగార్జున, ధనుష్‌ ప్రధాన పాత్రల్లో శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘కుబేర’. సునీల్‌ నారంగ్‌, పుస్కుర్‌ రామ్‌ మోహన్‌రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీ ప్రసాద్‌ అందించారు. ఛాయాగ్రహణం నికేత్‌ బొమ్మి నిర్వహించారు. రష్మిక మందన్న, జిమ్‌ సర్భ్‌ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు.

ఈ చిత్రం నుండి లేటెస్ట్ గా నాగార్జునకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ గ్లింప్స్‌ వీడియో విడుదలైంది. భారీ డబ్బుల కంటైనర్‌ ముందు వర్షంలో గొడుగు పట్టుకొని నడుచుకుంటూ వచ్చే నాగార్జున లుక్‌ ఆకట్టుకుంది. వర్షంలో కింద పడిపోయిన నోటును చూసి, తన జేబులోంచి ఓ నోటు తీసి ఆ కంటైనర్‌లో ఉన్న డబ్బుల మధ్య పెట్టే సన్నివేశం ఆసక్తికరంగా ఉంది. ఈ గ్లింప్స్‌ వీడియో చిత్రంపై అంచనాలను పెంచింది.

Leave a comment

error: Content is protected !!