పుష్ప: ది రూల్‌ సినిమా నుండి మొదటి పాట “పుష్ప.. పుష్ప.. పుష్ప.. పుష్ప‌రాజ్.. నువ్వు గ‌డ్డం అట్టా స‌వ‌రిస్తుంటే.. దేశం ద‌ద్దరిలే” ఈరోజు సాయంత్రం 5:04 కు విడుదలైంది. ఈ పాట విడుదలతో అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించారు. అదిరిపోయే సంగీతం, అద్భుతమైన విజువల్స్, అల్లు అర్జున్ స్టెప్స్, క్లాప్ కొట్టించే స్వాగ్, గూస్‌బంప్స్ తెప్పించే లిరిక్స్ ఈ పాటకు ప్రత్యేకతలు.

ఈ పాట పుష్ప పాత్రను మరింత ఎలివేట్ చేస్తుంది. పుష్ప-2 లో పుష్ప రాజ్ పాత్ర ఎలా ఉండబోతుందో ఈ పాట ద్వారా ఊహించుకోవచ్చు. ఈ పాట తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ, బెంగాలీ భాషల్లో కూడా విడుదలైంది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహాద్ ఫాజిల్ తో పాటు రాజా రవీంద్ర, సునీల్, అనసూయ తదితరులు నటించిన ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబర్ 15న విడుదల కానుంది.

Leave a comment

error: Content is protected !!