నాలుగున్నర దశాబ్దాల సినీ ప్రయాణంలో బహుముఖ ప్రజ్ఞాశాలిగా రాణించిన దాసరి నారాయణరావు 77వ జయంతి సందర్భంగా “దర్శకరత్న డి.ఎన్.ఆర్. ఫిల్మ్ అవార్డ్స్” వేడుక ఘనంగా జరగబోతోంది. ఈ వేడుక ఈ నెల 5న హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో జరగనుంది. ఈ వేడుక కోసం ప్రముఖ నటులు మురళి మోహన్, ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ పిలుపు నిచ్చారు. వారు ఈ సందర్భంగా వేడుక లోగోను ఆవిష్కరించారు. దాసరికి ఘన నివాళి అర్పించడం, సినిమా రంగంలో రాణించాలని ఆకాంక్షించే నేటి తరం యువతకు స్ఫూర్తినింపడమే ఈ వేడుక ముఖ్య ఉద్దేశ్యాలు అని వారు తెలిపారు.
దాసరి స్మారకార్ధం వివిధ రంగాల్లో రాణిస్తున్న వారికి “దాసరి లెజండరీ అవార్డ్స్” ప్రదానం చేయనున్నారు. 2023లో విడుదలైన చిత్రాలలోని వివిధ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి కూడా అవార్డులు అందించనున్నారు. ఈ పురస్కారాలను తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు అందజేస్తారు.
ఈ కార్యక్రమంలో:
కార్యక్రమ ముఖ్య నిర్వాహకుడు, ప్రముఖ ఆడిటర్ బి.ఎస్.ఎన్. సూర్యనారాయణ
కార్యక్రమ సంధానకర్త – ప్రముఖ నటులు ప్రదీప్
జ్యురీ మెంబర్స్ – ప్రముఖ ఫిల్మ్ జర్నలిస్ట్స్ ప్రభు, ధీరజ అప్పాజీ
జ్యురీ కమిటీ చైర్మన్ – ప్రముఖ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ
జ్యురీ కమిటీ సభ్యులు:
ప్రముఖ దర్శకుడు రేలంగి నరసింహారావు
ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్
ప్రముఖ ఆడిటర్ బి.ఎస్.ఎన్. సూర్యనారాయణ
ప్రముఖ నటులు ప్రదీప్, ప్రముఖ ఫిల్మ్ జర్నలిస్ట్స్ ప్రభు, ధీరజ అప్పాజీ
ఈ వేడుకను విజయవంతం చేయాలని చిత్ర పరిశ్రమ పెద్దలు, ప్రేక్షకులకు విజ్ఞప్తి చేశారు.
దాసరి నారాయణరావు తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ఒక దిగ్గజ దర్శకుడు, నిర్మాత, రచయిత. నాలుగు దశాబ్దాలకు పైగా సినీ రంగంలో పనిచేసిన ఆయన 150కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. 30కి పైగా చిత్రాలను నిర్మించారు. 100కి పైగా చిత్రాలకు రచన చేశారు. ఆయనకు పద్మభూషణ్, పద్మశ్రీ పురస్కారాలు కూడా లభించాయి.