ముదుగంటి క్రియేషన్స్ పై ముదుగంటి రవీందర్ రెడ్డి గారు నిర్మాతగా ఉయ్యాల జంపాల, మజ్ను సినిమాలతో దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున్న విరించి వర్మ దర్శకత్వంలో పేక మేడలు సినిమాతో నిర్మాతగా బాహుబలి, ఎవరికి చెప్పొద్దు వంటి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె లీడ్ రోల్ లో నటించిన సినిమా జితేందర్ రెడ్డి. 1980 కాలంలో జరిగిన వాస్తవిక సంఘటనలు ఆధారంగా పొలిటికల్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. వైశాలి రాజ్, రియా సుమన్, చత్రపతి శేఖర్, సుబ్బరాజు మరియు రవి ప్రకాష్ ఇతర ముఖ్య పాత్రలో నటించారు.

ఆర్ట్స్ సైన్స్ ఇంగ్లీష్ కంటే ముందు ఎన్నో విషయాలు జరిగాయి అవి తెలుసుకోవాలి. ఐన్స్టీన్, న్యూటన్ ఏ కాదు మనదేశంలో కూడా అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అంటూ కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో యూత్ ఫుల్ గా ఈ సాంగ్ ని తెరకెక్కించారు. ఈ పాటకి గోపి సుందర్ మ్యూజిక్ అందించగా రాంబాబు గోసాల లిరిక్స్ రాశారు మరియు రాహుల్ సిప్లిగంజ్ పాటని చాలా బాగా పాడారు. కాలేజీలో జరిగే ఎలక్షన్స్ గ్యాంగ్స్ మధ్య ఉండే రైవలరీస్ ఈ లిరికల్ సాంగ్ లో చూపించారు.

Leave a comment

error: Content is protected !!