మాస్ క దాస్ విశ్వక్ సేన్ ప్రేక్షకుల‌లో తనదైన ముద్ర వేసుకున్నారు. కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌లు చేయడంతో పాటు యూనిక్‌ కాన్సెప్ట్‌లతోనూ ప్రయోగాలు చేస్తున్నారు. విద్యాధర్ కాగిత దర్శకత్వంలో విశ్వక్ సేన్ చేస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘గామి’. కార్తీక్ కుల్ట్ క్రియేషన్స్‌పై కార్తీక్ శబరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ అడ్వెంచర్ డ్రామాని వి సెల్యులాయిడ్ సమర్పిస్తోంది. ఈ చిత్రానికి క్రౌడ్ ఫండ్ చేశారు.హైదరాబాద్ కామిక్ కాన్‌లో ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను లాంచ్ ద్వారా ప్రమోషన్‌లను ప్రారంభించారు. అఘోరా గెటప్‌లో విశ్వక్ సేన్ ఆశ్చర్యపరిచారు.
ఈ చిత్రంలో కలర్ ఫోటో ఫేమ్ చాందిని చౌదరి కథానాయికగా నటిస్తుండగా, ఎం జి అభినయ, హారిక, మహ్మద్ సమద్ ఇతర పాత్రల్లో నటించారు.

Leave a comment

error: Content is protected !!