నరేష్ అగస్త్య, అభినవ్ గోమఠం, విశ్వ దేవ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న బడ్డీ కామెడీ ఎంటర్ టైనర్ ‘కిస్మత్‌’. కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, అథీరా ప్రొడక్షన్స్ సంయుక్త నిర్మాణంలో శ్రీనాథ్ బాదినేని దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రలో పోషిస్తున్నారు. రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి సిహెచ్ భానుప్రసాద్ రెడ్డి సహ నిర్మాత. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ వచ్చింది.ఈ చిత్రం ఫిబ్రవరి 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ ని నిర్వహించింది.
దర్శకుడు శ్రీనాథ్ గారు చెప్పిన కథ చాలా నచ్చింది. ఈ సినిమాలో నటించడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఈ విషయంలో క్రెడిట్ అంతా దర్శకుడికి దక్కుతుందన్నారు అభినవ్‌ గోమఠం.
.కరోనా లాక్ డౌన్ సమయంలో నిర్మాత రాజు గారు పరిచయమయ్యారు. దాదాపు ఆరు నెలలు పాటు చాలా కష్టపడి ఈ కథని డెవలప్ చేశాం. కథ అద్భుతంగా వచ్చింది. మా నటీనటులు కూడా చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారన్నారు దర్శకుడు శ్రీనాధ్‌.
శ్రీనాథ్ గారు నాకు చాలా నచ్చిన డైరెక్టర్ . చాలా క్లారిటీతో వుంటారు. ఆయనకి లాంగ్ కెరీర్ వుండాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో భాగం కావడం గౌరవంగా భావిస్తున్నాను. నిర్మాత రాజు గారు చాలా కూల్ గా కాన్ఫిడెంట్ గా వుంటారు. ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నానన్నారు అవసరాల శ్రీనివాస్‌.

Leave a comment

error: Content is protected !!