క‌స్తూరి క్రియేష‌న్స్ అండ్ గోల్డెన్ వింగ్ ప్రొడ‌క్షన్స్‌ బ్యాన‌ర్స్‌పై ర‌వి క‌స్తూరి నిర్మించిన చిత్రం గేమ్ ఆన్. గీతానంద్, నేహా సోలంకి జంట‌గా న‌టించిన ఈ చిత్రానికి దయానంద్ దర్శకత్వం వహించారు. సీనియర్ నటులు మధుబాల, ఆదిత్య మీనన్, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం ఫిబ్రవ‌రి 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చేసిన మాసివ్ ప్రమోషన్స్‌లో మూవీ టీమ్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సంద‌ర్భంగా సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లోని దస్పల్లా హోటల్‌లో గ్రాండ్‌గా ప్రీ గేమ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిర్మాత వివేక్ కూచిభొట్ల, నటుడు శివ బాలాజీ హాజరయ్యారు. నిర్మాత వివేక్ కూచిభొట్ల ఈ మూవీ రిలీజ్ ట్రైలర్ ను లాంచ్ చేశారు. అనంతరం బిగ్ టిక్కెట్ ను లాంచ్ చేశారు.

ఈ సినిమా నేను చూశాను. మంచి కాన్సెప్ట్ తో చాలా బాగా తీశారు. ఫస్ట్ టైం డైరెక్టర్ లా ఎక్కడా అనిపించలేదు. ప్యాక్డ్ స్క్రీన్ ప్లే తో రూపొందించారు అన్నారు వివేక్ కూచిబొట్ల.

గీతానంద్ పేరు వెనుక కూడా ఒక స్టోరీ ఉంది. గీతా ఆర్ట్స్ సంస్థను చూసి ఆయనకు వాళ్ళ నాన్న ఈ పేరు పెట్టారు. గీత ఆర్ట్స్ ఎంత సక్సెస్ అయిందో గీతానంద్ కూడా సక్సెస్ ఫుల్ హీరోగా కొనసాగుతాడని నమ్మకం ఉంది. నేహా సోలంకి బాగా నటించింది అన్నారు శివబాలాజీ.
మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన నేను చాలా కష్టాలు పడ్డాను. బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా కంటెంట్ ఉన్న సినిమాలు తీయాలనుకున్నా. థియేటర్లో సినిమా చూసిన ప్రేక్షకులు ఇతర దమ్మున్న సినిమా అనుకునేలా దీన్ని రూపొందించాం. అలాంటి పవర్ ప్యాక్డ్ మూవీ ఇది అన్నారు హీరో గీతానంద్.
ఈ ప్రాజెక్టులో భాగమవడం గర్వంగా ఉంది. ఇందులో డిఫరెంట్ క్యారెక్టర్ చేశాను. నా పాత్రను డిజైన్ చేసిన డైరెక్టర్ దయానంద్ గారికి థాంక్స్. ప్రేక్షకులు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా అన్నారు హీరోయిన్‌ నేహా సోలంకి.

Leave a comment

error: Content is protected !!