క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ ‘హను-మాన్’. యంగ్ హీరో తేజ సజ్జ కథానాయకుడిగా ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అద్భుతంగా అలరించి, రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో ఎపిక్ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించి, సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ గ్రాటిట్యూడ్ మీట్ ని నిర్వహించింది.
నన్ను ప్రోత్సహించిన అమ్మానాన్నలకు కృతజ్ఞతలు. నిరంజన్ గారు లాంటి నిర్మాత దొరకడం మా అదృష్టం. చాలా గ్రాండ్ గా అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్లడాని సపోర్ట్ చేశారు. నేను తేజ చాలా కాలంగా ప్రయాణిస్తున్నాం. తేజ చాలా మంచి యాక్టర్. చాలా కష్టపడి ఈ సినిమా కోసం పని చేశాడు. తను చాలా పరిణతి గల వ్యక్తి. ఈ సినిమాకి తేజ పర్ఫెక్ట్ యాప్ట్ ని విడుదలకు ముందు చెప్పాను. ఇప్పుడు చూసి ప్రేక్షకులు అదే మాట చెప్పడం ఆనందంగా వుంది. ఈ సినిమాతో తను సూపర్ హీరో అయ్యాడు. ఫ్రెండ్‌ ని హీరో చేయడం ఒక తృప్తి. ఫ్రెండ్‌ ని స్టార్ చేయడం ఇంకా ఆనందాన్ని ఇస్తుంది. తనని ఈ స్థాయిలో చూడటం చాలా సంతోషంగా వుంది, ప్రతి ఒక్కరూ అయోధ్య రామమందిరానికి ఐదు రూపాయిలు డొనేట్ చేస్తున్నారు. ఇది నిర్మాత నిరంజన్ గారి వలనే సాధ్యపడింది. అయోధ్యతో పాటు మిగతా ఆలయాలకు కూడా ఇవ్వడానికి ఆయన సిద్ధంగా వున్నారన్నారు ప్రశాంత్ వర్మ.
మెగాస్టార్ ‘పద్మ విభూషణ్’ చిరంజీవి గారికి అభినందనలు. ఈ సినిమా కోసం టీం అంతా సమిష్టిగా కృషి చేశారు. డీవోపీ, మ్యూజిక్, ఆర్ట్ డిపార్ట్ మెంట్, ఎడిటింగ్, వీఎఫ్ఎక్స్.. ఇలా అన్నీ విభాగాలు చాలా కష్టపడి అద్భుతమైన ఒట పుట్ ఇచ్చారు. వరలక్ష్మీ గారు ఈ సినిమాలో భాగం కావడం ఆనందంగా వుంది. అమృత చాలా చాలా అద్భుతంగా తన పాత్రని చేశారు. గెటప్ శ్రీను, సత్య, వెన్నెల కిషోర్ ఇలా నటీనటులంతా చక్కని అభినయం కనపరిచారు. ఈ సినిమా కోసం పని చేసిన ప్రతి విభాగానికి పేరుపేరునా ధన్యవాదాలు. నిర్మాత నిరంజన్ గారు ఈ సినిమా వెనుక కొండంత అండగా నిలబడ్డారు. మమ్మల్ని బలంగా నమ్మారు. సినిమాని ఇంత అద్భుతంగా విడుదల చేసిన పంపిణీదారులందరికీ ధన్యవాదాలన్నారు హీరో తేజ సజ్జా.
హనుమాన్ లో భాగం కావడం చాలా గర్వంగా ఎమోషనల్ గా వుంది. అందరూ హనుమాన్ మీనాక్షి అంటూ టీమ్‌ కి ధన్యవాదాలు చెప్పారు అమృత అయ్యర్‌.
హనుమాన్ లో ఎలా అయితే హనుమాన్, మాన్ వున్నారో ఇక్కడ తేజ, ప్రశాంత్ వున్నారు. ఇంత విజయాన్ని అందుకున్న వారికి ముందుకు అభినందనలు.. నిర్మాతలు దర్శకుడి విజన్ ని అద్భుతంగా సపోర్ట్ చేశారంటూ సంతోషం వ్యక్తం చేసారు వరలక్ష్మీ శరత్‌కుమార్.
అద్భుతమైన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. నేను, దర్శకుడు ప్రశాంత్ వర్మ ఏదైతే నమ్మి మూడేళ్ళుగా హార్డ్ వర్క్ చేశామో.. ప్రేక్షకులకు ఆదరణతో ఈ రోజు అది సాధించామని భావిస్తున్నాం. అమృత, వరలక్ష్మీ.. మా టీం అందరికీ ధన్యవాదాలు. ఈ విజయం సమిష్టి కృషి. ఈ సినిమాకి తేజ పర్ఫెక్ట్ అని ఆడియన్స్ నిరూపించారు. తేజ లేకపోతే ఈ సినిమా లేదు. చాలా అంకిత భావంతో పని చేశారు. ప్రశాంత్ బలం తనకి తెలీదు. హనుమాన్ లో చూసింది కేవలం ఒక్క శాతమే. ఇంకా 99 శాతం బయటికి రావాలి. దాన్ని ఎచీవ్ చేస్తారని భావిస్తున్నాను. ఆయన విజన్ తెరపైకి తీసుకురావడానికి మొదటి వ్యక్తి నేను కావడం ఆనందంగా వుంది. తన విజన్ ని బౌండరీలు లేవు. అది ఈ రోజు ఆడియన్స్ ప్రూవ్ చేశారు. డిస్ట్రిబ్యుటర్స్ అందరికీ ధన్యవాదాలు. ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ తెలిపారు నిర్మాత నిరంజన్‌ రెడ్డి.
ఆ దేవుడు మాకిచ్చిన అనుగ్రహం ప్రశాంత్ ఈ చిత్రాన్ని మా వద్దకు తీసుకురావడం. ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణ చూస్తుంటే అనందంతో కన్నీళ్లు వస్తున్నాయి. దేవుడికి, ప్రేక్షకులకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు మరో నిర్మాత చైతన్య.

Leave a comment

error: Content is protected !!